9 గంటల పాటు పోసాని కృష్ణమురళిని ప్రశ్నించిన పోలీసులు

  • ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసానిని విచారించిన పోలీసులు
  • ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ
  • రైల్వేకోడూరు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు పోసానిని విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

విచారణ అనంతరం పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న హైదరాబాద్‌లో అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు తరలించిన విషయం తెలిసిందే.


More Telugu News