Posani Krishna Murali: పోలీసుల విచారణలో పోసాని కృష్ణమురళి ఆసక్తికర సమాధానాలు!

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని రాయదుర్గంలో పోసానిని అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఉదయం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోసానిని ప్రశ్నిస్తున్నారు. ఏడు గంటలుగా పోలీసులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.

పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నట్లు సమాచారం. తనకు తెలియదని, గుర్తులేదని, అవునా అంటూ సమాధానాలు చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి. మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలను చూపిస్తూ ప్రశ్నించినా, 'లవ్ యూ రాజా' అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
Posani Krishna Murali
Andhra Pradesh
Telugudesam

More Telugu News