Sankranthiki Vasthunnam: 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు

Sankranthiki Vasthunnam movie releasing on OTT on March 1st
  • మార్చి 1వ తేదీన ఓటీటీలోకీ 'సంక్రాంతికి వస్తున్నాం' 
  • జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే రోజే ఓటీటీలోకి వస్తోన్న చిత్రం
  • ఓటీటీలో కొన్ని కామెడీ సన్నివేశాలను జతపరిచే అవకాశం
వెంకటేశ్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ఓటీటీ విడుదల తేదీని జీ5 సంస్థ ప్రకటించింది. ఈ చిత్రాన్ని జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం చేయనున్నట్లు ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఓటీటీ విడుదల తేదీపై ప్రకటన రాలేదు. ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీ కూడా ఖరారైంది.

మార్చి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగు ఛానల్‌తో పాటు జీ5 ఓటీటీలోనూ ఈ చిత్రం ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని జీ5 సంస్థ తాజాగా తన యాప్‌లో విడుదల చేసిన ప్రత్యేక ప్రోమో ద్వారా తెలియజేసింది.

'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా నిడివిని దృష్టిలో ఉంచుకొని తొలగించిన కొన్ని హాస్య సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో జత చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Sankranthiki Vasthunnam
OTT
Tollywood

More Telugu News