ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
కాగా, ఏపీ, తెలంగాణలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహాశివరాత్రి కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పర్వదినం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు ఆలయాలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా భారీగానే ఏర్పాట్లు చేశారు. ఇక భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు తరలివచ్చి శివుడిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.