కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి ప్రయాగ్రాజ్లో మంత్రి నారాయణ బృందం పర్యటన
- 2027లో గోదావరి పుష్కరాలు
- ప్రయాగ్రాజ్ కుంభమేళా అథారిటీ కమాండ్ కంట్రోల్ రూం, స్నాన ఘాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ బృందం
- కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యలపై అధ్యయనం
ఈ క్రమంలో సోమవారం ప్రయాగరాజ్ చేరుకున్న మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరుల బృందం కుంభమేళా అధారిటీ ఆఫీసును సందర్శించింది. కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యల గురించి మంత్రి బృందానికి కుంభమేళా ఆఫీసర్ విజయ్ కిరణ్ ఆనంద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కుంభమేళా అధారిటీ కమాండ్ కంట్రోల్ రూం, స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లను అక్కడి అధికారులతో కలిసి మంత్రి బృందం పరిశీలించింది.