సుకుమార్‌ గురించి తెలుసుకో రాయుడు... ఆయన పబ్లిసిటికి దొరకడంటున్న ఫ్యాన్స్

  • అంబటి రాయుడు వ్యాఖ్యలపై మండి పడుతున్న సినీ ప్రముఖులు 
  • సుకుమార్‌ను స్క్రీన్‌పై చూపించి... అలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మండిపడుతున్న నెటిజన్లు 
  • సుకుమార్‌ పబ్లిసిటీ కావాలనుకుంటే నేషనల్‌ మీడియా అంతా సిద్దంగా ఉందంటున్న సినీ లవర్స్‌  
ఇటీవల జరిగిన ఇండియా, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు పలువురు సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా దుబాయ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు  బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'పుష్ప-2' దర్శకుడు సుకుమార్‌ కూడా ఈ మ్యాచ్‌ తిలకించడానికి కుటుంబంతో సహా వెళ్లాడు. అయితే ఈ మ్యాచ్‌ లైవ్‌ జరుగుతున్న సమయంలో తెలుగు కామెంటర్‌గా ఉన్న అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో దుమారాన్ని లేపుతున్నాయి. 

 ''దుబాయ్‌లో మ్యాచ్‌కు రావడం అంతా పబ్లిసిటి స్టంట్‌" అంటూ రాయుడు చేసిన  వ్యాఖ్యలు తెలుగు సినిమా సెలబ్రిటీలనే కాదు... యావత్‌ భారతీయ సినీ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది.  ఇలాంటి కామెంట్స్‌ చేయడం పట్ల పలువురు సినీ అభిమానులు అంబటి రాయుడిని ఏకిపారేస్తున్నారు. 


More Telugu News