చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి: కవిత
- మిర్చికి అధిక ధర కావాలని చంద్రబాబు ఢిల్లీలో కొట్లాడుతున్నారన్న కవిత
- రేవంత్ రెడ్డి కూడా కనీసం రూ.25 వేల మద్దతు ధర కోసం డిమాండ్ చేయాలని సూచన
- తెలంగాణ ప్రభుత్వం 'పీపీపీ' మోడ్‌లో నడుస్తోందని ఎద్దేవా
కవిత ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని అన్నారు. మిర్చి పంటకు ఎకరాకు లక్షల్లో ఖర్చవుతోందని ఆమె అన్నారు. మిర్చి, పసుపు రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని సూచించారు. మిర్చి రైతులకు కనీస మద్దతు ధర రాకుంటే వారు తీవ్రంగా నష్టపోతారని ఆమె అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 'పీపీపీ' మోడ్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. పీపీపీ అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సంటేజ్ అని చురక అంటించారు.