Manchu Lakshmi: భర్తతో విడిపోయిందనే వార్తలపై మంచు లక్ష్మి స్పందన

- భర్తతో మంచు లక్ష్మి విడాకులు తీసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నామన్న లక్ష్మి
- తమకు నచ్చిన విధంగా బతుకుతున్నామని వెల్లడి
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. టీవీ షోలతో కూడా ఆమె ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లక్ష్మి... పలు విషయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటూ ఉంటుంది.
మరోవైపు మంచు లక్ష్మి వైవాహిక జీవితంపై తాజాగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. భర్త శ్రీనివాస్ కు ఆమె విడాకులు ఇచ్చిందని, దీని వెనుక మోహన్ బాబు హస్తం ఉందని చెబుతున్నారు. ఈ వార్తలపై తాజాగా మంచు లక్ష్మి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
తన భర్త ఐటీ ప్రొఫెషనల్ అని, ఆయన విదేశాల్లో పనిచేస్తున్నారని లక్ష్మి తెలిపింది. తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నామని, తమకు నచ్చిన విధంగా బతుకుతున్నామని చెప్పింది. జనాలు ఏదో అనుకుంటారని తాము ఆలోచించమని తెలిపింది. తన కూతురు కూడా ప్రస్తుతం వాళ్ల నాన్న వద్ద ఉందని వెల్లడించింది.