Hari Hara Veeramallu: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' రెండో పాట వ‌చ్చేసింది.. ఈ సాంగ్‌ ఫ్యాన్స్ మనసులు 'కొల్లగొట్ట‌డం' ప‌క్కా!

Pawan Kalyan Hari Hara Veeramallu Kollagottinadiro Song Released
  • 'కొల్ల‌గొట్టినాదిరో' అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్ 
  • మంచి మాస్ బీట్ తో అదిరిపోయిన పాట‌
  • పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో 'హరిహర వీరమల్లు'
  • మార్చి 28న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సంద‌డి చేయ‌నున్న సినిమా
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా క్రిష్ జాగ‌ర్ల‌మూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం 'హరిహర వీరమల్లు'. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఈరోజు రెండో పాటను విడుదల చేశారు. 'కొల్ల‌గొట్టినాదిరో' అంటూ సాగే పాట‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. 

కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో... అంటూ వీరమల్లుని పొగుడుతూ సాగింది ఈ పాట‌. మంచి మాస్ బీట్ తో సాంగ్ అదిరిపోయింది. ఆస్కార్ అవార్డు గ్రహీత‌, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీరవాణి అందించిన బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఈ పాటను ఆలపించారు.  

ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.దయాకర్ రావు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. పవన్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి లాంటి బాలీవుడ్‌ స్టార్స్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 

కాగా, 'హరిహర వీరమల్లు' చిత్రానికి అత్యధిక భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన విష‌యం తెలిసిందే. ఇంకా చిత్రీకరణ మిగిలుండగానే క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. దాంతో ఆయన స్థానంలో ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. 'హరిహర వీరమల్లు' చిత్రం మార్చి 28న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సంద‌డి చేయ‌నుంది.

Hari Hara Veeramallu
Pawan Kalyan
Kollagottinadiro Song
Tollywood

More Telugu News