కర్ణాటక మఠానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా అందించిన బాలీవుడ్ హీరో
- ఆలయ పూజాకార్యక్రమాలలో వినియోగించేందుకు అప్పగింత
- పెటా సంస్థతో కలిసి మూగజీవాల పరిరక్షణకు కృషి చేస్తున్న సునీల్ శెట్టి
- ఒక్కో రోబోటిక్ ఏనుగుకు రూ.17 లక్షలు ఖర్చవుతుందంటున్న పెటా
ఈ క్రమంలోనే నిజమైన ఏనుగులను తలపించేలా రోబో ఏనుగులను తయారుచేయించి ఆలయాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు ఆలయాలకు, మఠాలకు అందించామని చెప్పారు. దీనివల్ల ఆలయ సంప్రదాయలు కొనసాగిస్తూనే ఏనుగులను సంరక్షించుకోవచ్చని చెప్పారు. ఒక్కో రోబో ఏనుగును తయారుచేయడానికి రూ.17 లక్షల వరకు ఖర్చవుతుందని వివరించారు. థాకర్సే సంస్థ ఇందుకు నిధులు సమకూరుస్తోంది. ఆ మధ్యన శిల్పాశెట్టి కూడా చిక్కమగళూరు జిల్లాలోని రంభపురి మఠానికి ఇలాగే రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు.