గిల్ ను బౌల్డ్ చేసిన తర్వాత 'ఇక వెళ్లు..' అన్నట్లుగా సైగ చేసిన అబ్రార్.. వీడియో ఇదిగో!
- 46 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన గిల్
- బ్యాటు పక్కనుంచి వెళ్లి వికెట్లను గిరాటేసిన బంతి
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
దీంతో హాఫ్ సెంచరీకి మరో నాలుగు పరుగుల దూరంలో వున్న గిల్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే, ఈ సందర్భంగా పాక్ బౌలర్ అబ్రార్ భారత బ్యాట్స్ మన్ గిల్ ను చూస్తూ ‘ఇక వెళ్లు.. వెళ్లు’ అన్నట్లు సైగ చేయడం కెమెరాలో రికార్డైంది. చేతులు రెండూ కట్టుకుని తల తిప్పుతూ సైగలు చేయడం, పక్కనే ఉన్న ముహమ్మద్ నవ్వడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.