కాంగ్రెస్ అభయ హస్తం... మొండి హస్తంలా మారింది: కిషన్ రెడ్డి
- తెలంగాణ సర్కారుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
- రోజుకో ప్రకటన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని వ్యాఖ్యలు
- 14 నెలలకే ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారని వెల్లడి
"రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించే పరిస్థితి కనిపించడంలేదు. కేవలం 14 నెలల పాలనలోనే ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని తెలంగాణ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు" అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.