MSRTC: కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపివేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. కారణం ఇదే!

Maharashtra halts bus services to Karnataka after attack in Chitradurga
    
కర్ణాటకలో మహారాష్ట్ర బస్సుపై దాడి జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. బెంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న బస్సుపై శుక్రవారం రాత్రి చిత్రదుర్గ ప్రాంతంలో కన్నడ అనుకూల మద్దతుదారులు దాడి చేశారు. 

అంతేకాదు, డ్రైవర్ భాస్కర్ జాధవ్‌ ముఖానికి నల్లరంగు పూయడంతోపాటు ఆయనపై దాడి చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయనంత వరకు ఆ రాష్ట్రానికి బస్సులు నడిపేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. 
MSRTC
Maharashtra
Karnataka
Attack
Pratap Sarnaik

More Telugu News