రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం: ట్రంప్
- మూడేళ్లు దాటిపోయినా కొనసాగుతున్న యుద్ధం
- యుద్ధం ఆగాలంటే జెలెన్ స్కీ, పుతిన్ కలవాలన్న ట్రంప్
- లక్షల చావులు ఆగాలంటే ఇద్దరూ కలిసి తీరాలని వ్యాఖ్య
తమతో ఉక్రెయిన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ కు అమెరికా భారీగా ఆయుధ, ఆర్థికసాయం అందించిందని తెలిపారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉక్రెయిన్ కు అమెరికా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని చెప్పారు. ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ తన వద్ద ఉన్న సహజ వనరులను అమెరికా కంపెనీలకు అందించాలని కోరారు. ఈ ఒప్పందానికి జెలెన్ స్కీ సానుకూలంగా స్పందించారని కూడా చెప్పారు.