ఛాంపియన్స్ ట్రోఫీ: సఫారీల చేతిలో ఆఫ్ఘన్లకు తప్పని ఓటమి
- ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా × ఆఫ్ఘనిస్థాన్
- కరాచీలో మ్యాచ్
- 107 పరుగులతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా
కరాచీలో జరిగిన ఈ గ్రూప్-బి మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (103) సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగులు చేసింది.
అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘన్ జట్టు 43.3 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. రహ్మత్ షా 90 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. అతడికి ఇతర బ్యాట్స్ మెన్ నుంచి సహకారం అందలేదు.
కెప్టెన్ హష్మతుల్లా షాహిది (0) డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా 3, లుంగీ ఎంగిడి 2, వియాన్ ముల్డర్ 2, మార్కో యన్సెన్ 1, కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీశారు.