నెల్లూరు జిల్లాలో ఎయిర్ పోర్టు.... భూములు పరిశీలించిన టీడీపీ నేతలు
- ఏపీలో కొత్తగా ఏడు విమానాశ్రయాల నిర్మాణం
- నెల్లూరు జిల్లాలో దగదర్తి వద్ద ఎయిర్ పోర్టు
- ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి భూములు పరిశీలించి నేతలు
ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, 2027 నాటికి దగదర్తి విమానాశ్రయం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. భూములకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లించే అంశంపై చర్చించామని వెల్లడించారు. 1,379 ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మించనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 669 ఎకరాల భూమి సేకరించడం జరిగిందని, మరో 710 ఎకాలు సేకరించాల్సి ఉందని వేమిరెడ్డి వివరించారు.
దగదర్తి విమానాశ్రయం ద్వారా ప్యాసింజర్, సరుకు రవాణా సేవలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో రెండు పోర్టులు ఉన్నందున ఎగుమతులు, దిగుమతులకు మరింత అనుకూలతలు ఉన్నాయని తెలిపారు. దగదర్తి ప్రాంతం పరిశ్రమల హబ్ గా అభివృద్ధి చెందుతుందని అన్నారు.