పాల డబ్బా ఉన్న స్కూటర్ పై మల్లారెడ్డి సందడి
- బోడుప్పల్ లో ఓ కార్యక్రమానికి వెళ్లిన మల్లారెడ్డి
- పాల డబ్బాతో ఉన్న స్కూటర్ పై చక్కర్లు
- పాలు అమ్ముతున్న వ్యక్తిని శాలువాతో సత్కరించిన వైనం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు పాల డబ్బాతో ఉన్న స్కూటర్ కనిపించింది. దీంతో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయో ఏమో కానీ వెంటనే స్కూటర్ ఎక్కారు. స్కూటర్ నడుపుతూ సందడి చేశారు. స్కూటర్ పై పాలు అమ్ముతున్న వ్యక్తిని శాలువాతో సత్కరించారు. కార్యకర్తలు, ప్రజలతో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.