జగన్ ప్రజల్లో తిరగకుండా కుట్రలు చేస్తున్నారు: అనంత వెంకటరామిరెడ్డి

వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో తిరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్లినప్పుడు కావాలనే జగన్ కు భద్రతను కుదించారని మండిపడ్డారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ కి భద్రతను కల్పించలేమని చంద్రబాబు చెప్పారని... గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న మిర్చి రైతులను పరామర్శించడం ఇల్లీగల్ యాక్టివిటీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. 

జగన్ కు భద్రతను కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వెంకటరామిరెడ్డి అన్నారు. కావాలనే జగన్ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మండిపడ్డారు. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేముందని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించిందని... గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.


More Telugu News