Srileela: బాలీవుడ్ సినిమాకు శ్రీలీల ఎంత తీసుకుందంటే..!

Srileela remuneration for Bollywood movie
  • తెలుగులో ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంటున్న శ్రీలీల
  • బాలీవుడ్ లో తొలి సినిమా చేస్తున్న శ్రీలీల
  • రూ. 1.75 కోట్ల పారితోషికం మాత్రమే తీసుకుందని టాక్
'పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల జెడ్ స్పీడ్ తో పలు చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అయితే మధ్యలో కొన్ని ఫ్లాపులు రావడంతో ఆమె స్పీడ్ కొంచెం తగ్గింది. 'పుష్ప 2' సినిమాలోని ఐటెం సాంగ్ తో ఆమె మళ్లీ పుంజుకుంది. కొత్త ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. తెలుగులో ఒక్కో సినిమాకు ఆమె రూ. 3 కోట్లు తీసుకుంటోందనే టాక్ ఉంది. 

తాజాగా శ్రీలీల ఒక బాలీవుడ్ మూవీ చేస్తోంది. అయితే ఈ సినిమాకు ఆమె కేవలం రూ. 1.75 కోట్లు మాత్రమే తీసుకుందట. బాలీవుడ్ లో తొలి సినిమా కాబట్టే ఆమె తక్కువ రెమ్యునరేషన్ కు ఒప్పుకుందని చెబుతున్నారు. మరోవైపు 'చావా' సినిమాకు రష్మిక మందన్న రూ. 4 కోట్లు తీసుకుందని టాక్. సౌత్ సినిమాల్లో కూడా ఆమె అంతే పారితోషికం అందుకుంటోంది.
Srileela
Bollywood
Tollywood
Remuneration

More Telugu News