ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారోత్సవం.. డిప్యూటీ సీఎం పవన్‌ను చూసి ఆగిన ప్రధాని మోదీ.. కాసేపు నవ్వులే నవ్వులు!
- ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం
- ఈ ప్రమాణస్వీకారానికి హాజరైన చంద్రబాబు, పవన్
- వారిద్దరిని అప్యాయంగా పలకరించిన ప్రధాని మోదీ
- జనసేనాని వద్ద ఆగి ప్రత్యేకంగా ముచ్చటించిన ప్రధాని
అయితే, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదిక మీదున్న ఎన్‌డీఏ నేతలకు అభివందనం చేస్తూ ముందుకెళ్తున్న ప్రధాని మోదీ పవన్ ను చూసి ఆగిపోయారు. ఆయనతో కరచాలనం చేయడంతో పాటు కొద్దిసేపు ముచ్చటించారు.
ఆ సమయంలో జనసేనానితో ఏదో మాట్లాడుతూ మోదీ నవ్వులు పూయించారు. ప్రధాని మాటలకు పవన్ తో పాటు పక్కన ఉన్న నేతలు కూడా పగలబడి నవ్వడం కనిపించింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబుకు కూడా మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పవన్, మోదీ నవ్వులు పూయించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.