ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారోత్సవం.. డిప్యూటీ సీఎం పవన్‌ను చూసి ఆగిన ప్రధాని మోదీ.. కాసేపు నవ్వులే నవ్వులు!
- ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణం
- ఈ ప్రమాణస్వీకారానికి హాజరైన చంద్రబాబు, పవన్
- వారిద్దరిని అప్యాయంగా పలకరించిన ప్రధాని మోదీ
- జనసేనాని వద్ద ఆగి ప్రత్యేకంగా ముచ్చటించిన ప్రధాని
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరైన విషయం తెలిసిందే. ఇదే కార్యక్రమానికి ఏపీ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
అయితే, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదిక మీదున్న ఎన్‌డీఏ నేతలకు అభివందనం చేస్తూ ముందుకెళ్తున్న ప్రధాని మోదీ పవన్ ను చూసి ఆగిపోయారు. ఆయనతో కరచాలనం చేయడంతో పాటు కొద్దిసేపు ముచ్చటించారు.
ఆ సమయంలో జనసేనానితో ఏదో మాట్లాడుతూ మోదీ నవ్వులు పూయించారు. ప్రధాని మాటలకు పవన్ తో పాటు పక్కన ఉన్న నేతలు కూడా పగలబడి నవ్వడం కనిపించింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబుకు కూడా మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పవన్, మోదీ నవ్వులు పూయించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.