కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్తలో ఊరట

  • భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు
  • అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లేవన్న లోకాయుక్త పోలీసులు
  • తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్న లోకాయుక్త పోలీసులు
ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) భూముల వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్తలో భారీ ఊరట లభించింది. భూముల కేటాయింపులో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు వెల్లడించారు.

ముడా భూముల వ్యవహారంలో సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని ఆధారాలు లేవని లోకాయుక్త పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య పార్వతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఈ అంశంపై తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు పోలీసులు లేఖ రాశారు.

ఈ కేసులో మొదటి నలుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేకపోవడంతో నిరూపితం కాలేదని తెలిపారు. నివేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు స్నేహమయికి వారం రోజులు గడువు ఇస్తున్నట్లు ఆ లేఖలో వెల్లడించారు. తదుపరి దర్యాఫ్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.


More Telugu News