హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి టీజీఎస్ఆర్టీసీ అదిరిపోయే రాయితీ
- 8 శాతం నుండి 10 శాతం వరకు ప్రత్యేక రాయితీ ప్రకటన
- లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ
- రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం రాయితీ
లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసులలో 10 శాతం రాయితీని ప్రకటించింది. రాజధాని ఏసీ సర్వీసుల్లో 8 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించేవారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ యాజమాన్యం కోరింది. టీజీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపింది.