Pawan Kalyan: కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

Pawan Kalyan takes holy dip in Triveni Sangamam at Maha Kumbhmela
  • యూపీలోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా
  • భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్ లతో కలిసి వచ్చిన పవన్
  • త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు 
  • వీడియో వైరల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవన్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరానందన్ తదితరులు పవిత్ర స్నానాలు చేశారు. ఈ పర్యటనలో పవన్ వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. 

ఇవాళ కుంభమేళాలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన సందర్భంగా ఆయన చొక్కా పూర్తిగా తీసేసి, కేవలం ధోతీపై నీళ్లలో మునిగారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan
Kumbhmela
Prayagraj
Uttar Pradesh
Janasena

More Telugu News