తెలంగాణ హైకోర్టులో ఓ కేసులో వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన న్యాయవాది

తెలంగాణ హైకోర్టులో ఒక సీనియర్ న్యాయవాది ఒక కేసులో వాదనలు వినిపిస్తూ గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. ఈ ఘటన హైకోర్టులోని తోటి న్యాయవాదులను, కేసు విచారణకు హాజరైన వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గుండెపోటుకు గురైన న్యాయవాదిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు.

21వ కోర్టు హాలులో న్యాయవాది వేణుగోపాలరావు ఒక కేసు విషయమై వాదనలు వినిపిస్తుండగా ఒక్కసారిగా నేలకొరిగారు. వెంటనే స్పందించిన న్యాయమూర్తి, తోటి న్యాయవాదులు ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. న్యాయవాది వేణుగోపాలరావు మృతికి సంతాపంగా 21వ కోర్టు హాలులో న్యాయమూర్తి విచారణను నిలిపివేశారు. మిగిలిన కోర్టు హాళ్లలో కూడా రెగ్యులర్ పిటిషన్ల విచారణను వాయిదా వేశారు.

TS High Court
Telangana
High Court

More Telugu News