Interanational Temples Seminar: తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu inaugurates Interanational Temples Seminar in Tirupati
  • తిరుపతిలో మూడ్రోజుల పాటు అంతర్జాతీయ దేవాలయాల సదస్సు
  • 58 దేశాల నుంచి ప్రతినిధుల రాక
  • ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, మహా సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం సావంత్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించారు. ఈ దేవాలయాల మహాకుంభ్ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హాజరయ్యారు. 

ఆ భారీ ఆధ్యాత్మిక సదస్సులో ప్రపంచంలోని 58 దేశాల నుంచి వచ్చిన 1,581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సదస్సులో 15 వర్క్ షాప్ లు నిర్వహించనున్నారు. 60 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఒకరోజు కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ నెల 19న ఏపీ మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు. 

కాగా, ఇవాళ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా... ముంబయిలో టీటీడీకి స్థలం కేటాయించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ముంబయిలో అమ్మవారి ఆలయం నిర్మాణం, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రం కోసం  స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఫడ్నవీస్ కు వినతి పత్రం అందించారు.
Interanational Temples Seminar
Chandrababu
Tirupati

More Telugu News