Balakrishna: ఏపీలో మరో క్యాన్సర్ ఆసుపత్రి: ఎమ్మెల్యే బాల‌కృష్ణ

Cancer Hospital in Tullur Says MLA Nandamuri Balakrishna

  • బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని మ‌రింత విస్త‌రిస్తున్న‌ట్లు చెప్పిన బాల‌య్య‌
  • ఏపీలోని తుళ్లూరులో మ‌రో 8 నెల‌ల్లో ఆసుప‌త్రిని ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డి
  • క్యాన్సర్ బాధితులు మ‌నోధైర్యంతో ఉంటే క‌చ్చితంగా కోలుకుంటార‌న్న బాల‌కృష్ణ‌

 బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని మ‌రింత విస్త‌రించ‌నున్న‌ట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. విస్త‌ర‌ణ‌లో భాగంగా ఏపీలోని తుళ్లూరులో మ‌రో ఎనిమిది నెల‌ల్లో ఆసుప‌త్రిని ప్రారంభిస్తామ‌ని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిని దృష్టిలోని పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

ఈరోజు హైద‌రాబాద్ లోని క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో ఆంకాల‌జీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ, పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. క్యాన్సర్ బాధితులు మ‌నోధైర్యంతో ఉంటే క‌చ్చితంగా కోలుకుంటార‌ని బాలకృష్ణ పేర్కొన్నారు.  

Balakrishna
Cancer Hospital
Tullur
Andhra Pradesh
  • Loading...

More Telugu News