ప్రతిసారి తగ్గను.. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: విష్వక్సేన్
- 'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ వ్యాఖ్యలు వివాదాస్పదం
- ఇప్పటికే క్షమాపణ చెప్పిన విష్వక్సేన్
- అయినా తగ్గని 'బాయ్ కాట్ లైలా' ట్రెండ్
- ఎక్కువగా ఆలోచించవద్దన్న విష్వక్సేన్
'నేను ప్రతిసారి తగ్గను. ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగిన దానికి క్షమాపణలు చెప్పాను. ఎక్కువగా ఆలోచించవద్దు. ప్రశాంతంగా ఉండండి. మళ్లీ చెపుతున్నా. నేను నటుడిని మాత్రమే. నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు' అని విష్వక్సేన్ ట్వీట్ చేశారు.