Sankrantiki Vastunnam: గోదారి గట్టు మీద రామచిలుకవే.. ఫుల్ వీడియో ఇదిగో!

Godari Gattu meeda Ramachilukave Full Song Released

--


విక్టరీ వెంకటేశ్ తాజా బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో గోదారి గట్టు మీద రామ చిలుకవే పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మైక్ పట్టుకున్న రమణ గోగుల ఈ పాటతో తన మార్క్ చూపించారు. మూవీ ట్రైలర్ విడుదలైన నాటి నుంచి ఈ పాటపై రీల్స్ చేస్తూ నెటిజన్లు వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వెర్షన్ ను మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేశారు. రమణ గోగుల, మధుప్రియ ఆలపించిన ఈ పాట సెన్సేషనల్ గా మారింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటించారు.

  • Loading...

More Telugu News