ఢిల్లీలో గెలుపు దిశగా బీజేపీ.. చంద్రబాబు ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ముందంజ!

BJP in lead where Chandrababu campaigned in Delhi
  • మొత్తం 70 స్థానాల్లో 45 స్థానాల్లో బీజేపీ లీడింగ్
  • 27 ఏళ్ల తర్వాత అధికారం దిశగా బీజేపీ
  • చంద్రబాబు ప్రచారం నిర్వహించిన 4 స్థానాల్లో బీజేపీ లీడింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పూర్తి ఆధిక్యత దిశగా బీజేపీ దూసుకుపోతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆప్ ను ఓటర్లు పక్కన పెట్టేశారు. మొత్తం 70 స్థానాల్లో 45 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఆప్ 24, కాంగ్రెస్ 1 స్థానంలో లీడింగ్ లో ఉన్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. 

మరోపైపు ఎన్డీయే భాగస్వామిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరపున ప్రచారం నిర్వహించిన చంద్రబాబు... ఆమ్ ఆద్మీ పార్టీపైనా, కేజ్రీవాల్ పైనా విమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పారు. మరోవైపు చంద్రబాబు ప్రచారం నిర్వహించిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఆయన ప్రచారం నిర్వహించిన షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్, సహద్ర నియోజకవర్గాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
BJP
AAP

More Telugu News