'సంక్రాంతికి వస్తున్నాం' ఏ ఓటీటీ వేదికలో చూడొచ్చంటే...!
- వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం
- ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం
- రికార్డు స్థాయిలో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు
- ఈ సినిమా శాటిలైట్, ఓటీటీ రైట్స్ పై అప్ డేట్
తాజాగా, సంక్రాంతికి వస్తున్నాం చిత్రం శాటిలైట్, ఓటీటీ హక్కులకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు చానల్ దక్కించుకోగా, ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది.