Stock Market: స్టాక్ మార్కెట్లకు వరుసగా రెండో రోజు నష్టాలు

markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు ఉన్నప్పటికీ... ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతను పాటించారు. ఈ క్రమంలో మన మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్... 213 పాయింట్ల నష్టంతో 78,058కి పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 23,622 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ పోర్ట్స్ (1.72%), ఇన్ఫోసిస్ (0.94%), యాక్సిస్ బ్యాంక్ (0.71%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.60%), టెక్ మహీంద్రా (0.58%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.47%), టైటాన్ (-2.28%), ఎన్టీపీసీ (-2.13%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.79%), ఐటీసీ (-1.53%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News