ఒక రోజు ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

telangana assembly meeting on february 4th
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఒక రోజు ముందుగానే నిర్వహించనున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి, ఆ తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో వీటిపై చర్చించాలని భావించారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ నెల 1న వెల్లడించారు. 

అయితే ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 4వ తేదీనే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను కేబినెట్‌కు అందజేస్తారు. 

కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణలపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసనమండలిలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు.   
Go Back to Shorts
Telangana Assembly Session
CM Revanth Reddy
Telangana

More Telugu News