కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడేందుకు మాటలు రావడం లేదు: కొండా సురేఖ
- బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న కొండా సురేఖ
- చిన్న రాష్ట్రమైన తెలంగాణకు తగిన కేటాయింపులు రాలేదని విమర్శ
- తెలంగాణకు ఇచ్చిన హామీలు విస్మరించారన్న మంత్రి
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించినట్లు కొండా సురేఖ తెలిపారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారని ఆమె వెల్లడించారు.