ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్ కుమార్ గుప్తా
- డీజీపీగా ముగిసిన ద్వారకా తిరుమలరావు పదవీకాలం
- నేడు పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి
- ఏపీ పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తాను నియమించిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం వచ్చాక సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవీకాలం నేటితో ముగిసింది. ఇవాళ ఆయనకు పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది.