నేను కొడితే మామూలుగా ఉండదు: రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ వార్నింగ్
- మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్న కేసీఆర్
- రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయని విమర్శ
- ఎవడో చెప్పిన మాటలు విని ప్రజలు ఓటేశారని వ్యాఖ్య
రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయని కేసీఆర్ విమర్శించారు. కాళేశ్వరం, బసవేశ్వరం, సంగమేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రభుత్వం ఎందుకు ఆపిందని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై దండయాత్ర చేయాలని హరీశ్ రావుకు చెపుతున్నానని అన్నారు.
ఎవడో చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓటు వేశారని... తెలంగాణకు మంచి గుణపాఠం జరిగిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కైలాస ఆటలో పైకి పోయిన తర్వాత పెద్ద పాము మింగినట్టు రాష్ట్ర పరిస్థితి తయారయిందని అన్నారు. కరోనా సమయంలో కూడా తాను రైతు బంధు ఇచ్చాని, రైతుల కోసం ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చానని... ఇప్పుడు అంతా గంగలో కలిసిపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిందని... రాజకీయాల కోసం పుట్టింది కాదని అన్నారు.