జగన్ బంధువుకు గనులు కేటాయించిన గనుల శాఖ కార్యదర్శి... ఏపీ ప్రభుత్వం సీరియస్

  • పులివెందులకు చెందిన వెంకటరెడ్డికి బెరైటీస్ గనులను కేటాయించిన ప్రవీణ్ కుమార్
  • జగన్‌కు వరుసకు సోదరుడు వెంకటరెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వం సీరియస్... సెలవులపై వెళ్లిన ప్రవీణ్ కుమార్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బంధువు వెంకటరెడ్డికి బెరైటీస్ గనుల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుత గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 14 వరకు సెలవుపై వెళ్లారు.

దీంతో, గనుల శాఖ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనాకు అప్పగించింది. ఏపీఎండీసీ ఎండీ బాధ్యతలను కూడా మీనాకే అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పులివెందులకు చెందిన వెంకటరెడ్డికి రాష్ట్ర గనుల శాఖ సంక్రాంతి పండుగ సమయంలో వైఎస్సార్ జిల్లా వేములలో దాదాపు రూ.100 కోట్లకు పైగా విలువ చేసే బెరైటీస్ నిల్వలున్న లీజును కట్టబెట్టింది. వెంకటరెడ్డి మాజీ సీఎం జగన్‌కు వరుసకు సోదరుడు అవుతారు. ఈ నెల 15న లీజు కేటాయిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ వెంకటరెడ్డికి 9.55 హెక్టార్లలో 20 ఏళ్ల కాల వ్యవధితో లీజును మంజూరు చేస్తూ గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.


More Telugu News