విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్!

Police arrested nine people in Hyderabad
విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. గౌలిదొడ్డిలోని టీఎన్జీవోస్ కాలనీలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు మాదాపూర్ ఎస్‌వోటీ, హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు సంయుక్తంగా ఈ ముఠాను పట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టీఎన్జీవోస్ కాలనీలో టెలిగ్రామ్ యాప్ ద్వారా గత మూడు నెలలుగా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

విటులు వ్యభిచారం జరిగే అపార్ట్‌మెంట్‌కు చేరుకోగానే టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన లింక్‌ను తొలగించి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. బ్యాంకాక్, కెన్యా వంటి దేశాలకు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు ఏజెంట్లు, ఒక కస్టమర్‌తో పాటు పలువురు విదేశీ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Police
Telangana

More Telugu News