Crime News: మీర్‌పేటలో భార్యను చంపేసి ముక్కలుగా నరికిన కేసు... భర్త అరెస్ట్

Husband arrested in Meerpet murder case
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో సంచలనం సృష్టించిన మీర్‌పేట హత్య కేసులో నిందితుడి గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పది రోజుల క్రితం భార్యను హత్య చేసి, ముక్కలు చేసి, వాటిని ఉడికించి, కాల్చివేసి, ఎముకలు పొడి చేసి చెరువులో పడవేసిన ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆమె భర్త గురుమూర్తి నిందితుడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేసి ఆధారాలు సేకరించారు.

భార్యను చంపేసిన గురుమూర్తి ఆ తర్వాత ఏమీ తెలియనట్లు... భార్య తల్లి సుబ్బమ్మతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రెండు మూడు రోజులుగా కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అయితే ఓ మహిళ గురించి భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు... గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో గురుమూర్తి తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Crime News
Telangana
Hyderabad

More Telugu News