నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు

  • గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం
  • తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్
హైదరాబాద్‌లోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు ఈరోజు బాంబు బెదిరింపు వచ్చింది. స్కూల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే స్కూల్‌కు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడం ఈ నెలలో ఇది రెండోసారి. 

స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో యాజమాన్యం విద్యార్థులను వెంటనే బయటకు పంపించింది. డాగ్ స్క్వాడ్ వచ్చి క్లాస్ రూంలతో పాటు స్కూల్ ప్రాంతాన్ని మొత్తం తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని తెలుస్తోంది.


More Telugu News