రేప‌టి నుంచి 'ఆర్‌సీ 16' షూటింగ్‌లో రామ్ చ‌ర‌ణ్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేప‌టి నుంచి 'ఆర్‌సీ 16' షూటింగ్‌లో రామ్ చ‌ర‌ణ్‌!

Ramcharan RC 16 Shooting in Hyderabad
  • రామ్ చ‌ర‌ణ్, బుచ్చిబాబు సానా కాంబోలో 'ఆర్‌సీ 16' 
  • బుధ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్‌ 
  • ఈ షెడ్యూల్‌లో హీరోతో పాటు ప్రధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌
  • చెర్రీ స‌ర‌స‌న హీరోయిన్‌గా బాలీవుడ్ భామ‌ జాన్వీ క‌పూర్
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సానా కాంబినేష‌న్ లో 'ఆర్‌సీ 16' అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ప్రారంభమైన ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేప‌టి నుంచి హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. రాత్రివేళ సాగే ఈ షెడ్యూల్‌లో హీరో రామ్ చ‌ర‌ణ్‌తో పాటు ప్రధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

దీనికోసం ప్ర‌త్యేకంగా ఓ సెట్‌ను నిర్మించిన‌ట్లు స‌మాచారం. ఉత్త‌రాంధ్ర నేప‌థ్యంలో ఓ ఆట‌తో ముడిప‌డి ఉన్న భావోద్వేగ‌పూరిత‌ క‌థాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మూవీకి 'పెద్ది' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని టాక్‌. చెర్రీ స‌ర‌స‌న క‌థానాయిక‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. 

ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్‌, జ‌గ‌ప‌తి బాబు, దివ్యేందు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌ల‌తో క‌లిసి సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ బాణీలు అందిస్తున్నారు. ఇక ఇటీవ‌ల సంక్రాంతికి రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ చ‌ర‌ణ్ త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఫిదా చేశారు.
Advertisement
RC 16
Ramcharan
Buchi Babu Sana
Tollywood

More Telugu News