Pawan Kalyan: నారా దేవాన్ష్ వరల్డ్ రికార్డుపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan opines on Nara Devansh World Record in Chess
  • చెస్ లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న నారా లోకేశ్ తనయుడు
  • ఇటీవల అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ రికార్డు
  • అభినందనలు తెలుపుతూ పవన్ ప్రకటన
ఏపీ మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ ఇటీవల చెస్ క్రీడాంశంలో వరల్డ్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. చెస్ క్రీడలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావించే 175 పజిల్స్ ను దేవాన్ష్ అలవోకగా పూర్తి చేశాడు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. 

ఐటీ, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేశ్ గారి తనయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మనవడు నారా దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకన్లలోనే 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. చిన్న వయసులోనే చెస్ క్రీడాంశంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దేవాన్ష్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ మేరకు డిప్యూటీ సీఎంవో ఓ ట్వీట్ చేసింది. నారా దేవాన్ష్ వరల్డ్ రికార్డు వీడియోను కూడా పంచుకుంది.
Pawan Kalyan
Nara Devansh
World Record
Chess
Nara Lokesh
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News