పద్మ అవార్డులకు వీరంతా అర్హులు: చిరంజీవి
- నందమూరి బాలకృష్ణ సహా పలువురికి పద్మ పురస్కారాలు
- పద్మ అవార్డులు అందుకోనున్న వారికి చిరంజీవి అభినందనలు
పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి, పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నందమూరి బాలకృష్ణ, అజిత్‌కుమార్, అనంత్ నాగ్, శేఖర్ కపూర్ జీ, ‘రుద్రవీణ’ చిత్రంలో సహనటి శోభనకు అభినందనలు తెలియజేశారు. అలానే అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణి శర్మతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వీరంతా అవార్డులకు అర్హులని చిరంజీవి పేర్కొన్నారు.