బంజారాహిల్స్‌లో ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి

Car accident in Banjara Hills
  • ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తి మృతి
  • మరో ఇద్దరికి గాయాలు... ఆసుపత్రికి తరలింపు
  • కారును అక్కడే వదిలేసి పారిపోయిన నిందితులు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక కారును అక్కడే వదిలేసి పారిపోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కారు ఎవరిది? ప్రమాదం ఎలా జరిగింది? పరారైన నిందితులు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Road Accident
Hyderabad
Telangana

More Telugu News