ముషీరాబాద్‌లో హెబ్రోన్ చర్చిపై ఆధిపత్య పోరు... ఉద్రిక్తత

  • చర్చి లోనికి వెళ్లి తాళం వేసుకున్న పాస్టర్, అతని వర్గీయులు
  • గేటు వద్ద ఆందోళనకు దిగిన మరో వర్గానికి చెందినవారు
  • ఉద్రిక్తత ఏర్పడటంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో గల హెబ్రోన్ చర్చిపై ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. సొసైటీ సభ్యులు, ట్రస్టు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఈరోజు ఈ చర్చి వద్ద ఉద్రికత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ పాస్టర్, అతని వర్గీయులు లోనికి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకున్నారు. దీంతో మరో వర్గానికి చెందినవారు గేటు బయట ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

విషయం తెలుసుకున్న ముషీరాబాద్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దాదాపు వంద మంది పోలీసులు చేరుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

సొసైటీ సభ్యులు బౌన్సర్లను పెట్టి మరీ తమను లోనికి అనుమతించడం లేదని ట్రస్ట్ సభ్యులు ఇటీవల ఆరోపించారు. ఈ క్రమంలో తాము ఈరోజు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా సొసైటీ సభ్యులు లోనికి వెళ్లి తాళం వేసుకున్నారని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తును ఉంచారు.


More Telugu News