Talasani: మేయర్, డిప్యూటీ మేయర్‌‍పై అవిశ్వాస తీర్మానం... తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas Yadav talks about no confidence motion for GHMC
  • ప్రజా సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చామన్న తలసాని
  • కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణం ఆగిపోయిందన్న మంత్రి
  • జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌కే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని వెల్లడి
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ లపై అవిశ్వాస తీర్మానం అంశంపై ఎల్లుండి పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఆగిపోయాయన్నారు.

ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలకు సమావేశాల్లో సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. 
Talasani
GHMC
BRS
Congress

More Telugu News