Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

Kavitha open letter to CM Revanth Reddy
Advertisement
  • బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలయాపన చేస్తారని ప్రశ్న
  • రిజర్వేషన్లను పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చిందన్న కవిత
  • రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న ఎమ్మెల్సీ
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంతకాలం తాత్సారం చేస్తారని కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లను పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా అమలు చేయలేదని మండిపడ్డారు.

బీసీలకు ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1 లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ గత బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే కామారెడ్డి డిక్లరేషన్‌ను ఉల్లంఘించారన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీ వర్గాల్లో ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు. ఈ వైఖరితో రాష్ట్రంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రధాన హామీ అయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం అమలు చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమలు చేస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్నారని తెలిపారు. బీసీ గణనను అశాస్త్రీయంగా నిర్వహించారని, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేసే ఆలోచన కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంటే చులకన ఎందుకని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో గ్రామపంచాయతీల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది అవుతోందని, మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం కూడా ముగిసిందని గుర్తు చేశారు. కానీ రిజర్వేషన్లను పెంచి ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లను 42 శాతం పెంచాల్సిందే అన్నారు. 
Advertisement
Advertisement
K Kavitha
BRS
Revanth Reddy

More Telugu News