అస్సాం సర్కార్ పై సుప్రీం కోర్టు అగ్రహం .. సీఎస్‌కు నోటీసు
- విదేశీయుల నిర్బంధానికి కారణాలు ఎందుకు వెల్లడించలేదన్న సుప్రీం కోర్టు
- రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లోపభూయిష్టంగా ఉందంటూ ఆక్షేపణ
- తదుపరి విచారణకు సీఎస్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హజరుకావాలని ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లోపభూయిష్టంగా ఉందని, తాము కోరిన వివరాలు అందులో లేవని బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. డిసెంబర్ 9న విచారణ సమయంలో విదేశీయుల నిర్బంధానికి గల కారణాలు తెలుపడంతో పాటు వారిని దేశం నుంచి పంపించి వేయడానికి తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇందుకు ఆరు వారాల సమయం ఇచ్చింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో ఆ వివరాలు ఏమీ లేవని, విదేశీయులను ఇంకా నిర్బంధ శిబిరాల్లోనే కొనసాగించేందుకు సరైన వివరణ ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగాలేదని ధర్మాసనం ఆక్షేపించింది.