అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు... నిధుల విడుదలకు హడ్కో ఆమోదం
- ఊపందుకోనున్న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం
- రూ.11 వేల కోట్ల రుణానికి హడ్కో ఆమోదం
- హర్షం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో గతంలోనే రూ.11 వేల కోట్లు కేటాయించింది. దీనిపై గతేడాది అక్టోబరులోనే మంత్రి నారాయణ హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టతో సమావేశమై నిధుల విడుదలపై చర్చించారు. హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరుతెన్నులను మంత్రి నారాయణ అప్పట్లోనే హడ్కో సీఎండీకి వివరించారు.
ఈ నేపథ్యంలో, తాజాగా ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు ఆమోదం లభించింది.