నటీనటులపై వ్యాఖ్యలు... క్షమాపణలు చెప్పిన వేణుస్వామి

  • నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు
  • వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వేణుస్వామి వెల్లడి
  • మహిళా కమిషన్‌కు వెళ్లి క్షమాపణలు
తెలంగాణ మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చిన ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి క్షమాపణలు చెప్పారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణలు కోరారు. వారిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. 

నటీనటులపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలకు గాను రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మహిళా కమిషన్ నోటీసులను వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. అయితే మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్‌కు వచ్చిన వేణుస్వామి క్షమాపణలు చెప్పారు.


More Telugu News